క్రైమ్/లీగల్

ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, ఫిబ్రవరి 10: కామంతో కళ్లు మూసుకుపోయిన కామందుల అత్యాచారాలు, పైశాచిక చర్యలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి... చట్టాలు ఎన్ని ఉన్నా కామాందులు వాటిని లెక్క చేయకుండా పైశాచికంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కామపిశాచులను కఠినగం శిక్షించి, చట్టాన్ని కాపాడవలిసిన పోలీసులే నిందితులకు చుట్టాలుగా మారడం మూలంగా బాధితులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు సర్వత్ర వెల్లువెత్తుతున్నాయి. చట్టాలలో ఉన్న లొసుగులను అసరాచేసుకుని కొందరు, డబ్బు, పలుకుబడితో మద్యం, డ్రగ్స్ మత్తులో రాక్షసులుగా మారుతున్నారు. ఏమాత్రం అవకాశం దొరికిన వదలకుండా యువతులను కిడ్నాప్‌లు చేసి అత్యాచారాలకు పాల్పడడమే కాకుండా అడ్రస్ దొరకకుండా కృరంగా హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కొకోల్లోలు. పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించకపోవడం వల్లే కామాందులు కామంతో రెచ్చి పోతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ నగరంలో ఆభం, శుభం తెలియని ఒక ఆరేళ్ల బాలిక హత్యాచారానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ నగరంలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... రామన్నపేటకు చెందిన డిష్‌బిల్ యాజమాని ప్రభుచరణ్ అనే వ్యక్తి ఈ నెల 5వవతేదీ రాత్రి సుమారు ఏడుగంటలకు అదే ప్రాంతానికి చెందిన అయిత అనిత-రాజేష్ దంపతులకు చెందిన ఆరేళ్ల కూతురును మాయమాటలు చెప్పి భద్రకాళి దేవస్థానం సమీపంలోని గుట్టల వద్దకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు రక్తస్రావం కావడంతో భయపడ్డ నిందితుడు హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో అటువైపు ఎవరో వస్తున్న విషయాన్ని గమనించి ప్రభుచరణ్ పారిపోయాడు. బాలిక ఏడుపులు విని అక్కడకు చేరుకున్న స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రిలో చేర్పించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను వెలుగులోకి రాకుండా పోలీసులు కప్పిపుచ్చడం, బాధితురాలి కుటుంభ సభ్యులతో రాజీ కుదుర్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలపై ఆదివారం నిరసనలు వెల్లువెత్తాయి. ఐద్వా, కెవిపిఎస్, 24చ 27 డివిజన్లకు చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కాకతీయ సెంటర్‌నుండి ఎంజిఎం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫ్లకార్డులు, బ్యానర్లు చేతబూని ఎంజిఎం సెంటర్‌లో రాస్తారోకో చేసి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లి అనిత అర్ధనాదాలతో నిందితున్ని కఠినంగా శిక్షించాలని, పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. మహిళా, ప్రజా, యువజన, పార్టీల నాయకులు పసి బాలికను హత్యాచారం చేసి, హత్యాయత్నానికి పాల్పడిన ప్రభుచరణ్‌పై నిర్భయ, హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. లేనిచో అన్ని మహిళా సంఘాలను సమీకరించి ఆందోళన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ఆందోళన సందర్భంగా వరంగల్-కాజీపేట వెళ్లు వాహనాల రాకపోకలు నిలిచి పోవడంతో ట్రాఫిక్ స్థంభించి పోయింది. దీంతో స్థానిక పోలీసులు బాధితురాలు కుటుంబ సభ్యులను, ప్రజా, యువజన, పార్టీల నాయకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేసారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ వరంగల్ అర్భన్, రూరల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు ఓరుగంటి పద్మ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రాధ తదితరులు ఎంజిఎంలో చికిత్స పొందుతన్న బాధితురాలును పరామర్శించారు.