క్రైమ్/లీగల్

భార్య, కుమారుడి హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 10: భార్య, కుమారుడిని చంపి పెట్రోల్ పోసి నిప్పంటించి తగులబెట్టిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలో ఆదివారం సంచలనం సృష్టించింది. సంఘటన వివరాలు ఘట్‌కేసర్ పోలీసుల కథనం ఇలా ఉన్నాయి. పోలీసుస్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 86లోని దాసుకు చెందిన వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని ఇద్దరిని చంపి కాల్చివేసినట్లు వచ్చిన సమాచారంపై మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన మచ్చల రమేశ్ (27), వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత (26) 2015లో ఆర్యసమాజంలో వివాహం చేసుక్నున్నారు. కొంతకాలం సజావుగా జరిగిన వీరి కాపురంలో కలహాలు నెలకొన్నాయ. దీంతో ఎనిమిది నెలలుగా సుశ్రుత తల్లిదండ్రుల వద్ద ఉంటూ నాలుగు నెలల క్రితం కుమారుడికి జన్మనిచ్చింది. శనివారం సాయంత్రం ఉప్పల్‌లో భర్త రమేశ్‌ను కలిసేందుకు కుమారుడితో పాటు సుశ్రుత రాగా ఇద్దరూ కలిసి ఘట్‌కేసర్ అవుటర్ రింగ్‌రోడ్డు వద్దకు చేరుకున్న తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. దీంతో ఆవేశానికి గురైన సుశ్రుత తనవెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగటంతో పాటు మరో మాత్రను పౌడర్‌గా చేసి పాలలో కలిపి కుమారుడికి యిచ్చింది. రాత్రి తొమ్మిది గంటలు కావటంతో నిద్రలోకి జారుకుంటున్న భార్య, కుమారుడిని తన బైకుపై తీసుకుని హైద్రాబాద్-వరంగల్ జాతీయ రహదారి హెచ్‌పీసీఎల్ కంపెనీ సమీపంలోని ప్రభాకర్ ఎన్‌క్లేవ్‌లోని వెంచర్‌లోకి రమేష్ తీసుకువెళ్లి అక్కడ నిద్రమత్తులో ఉన్న భార్య, కుమారుడిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పరిసరాల్లో ఉన్న కట్టెలను సమకూర్చి, పక్కన ఉన్న పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీసుకువచ్చి మృతదేహాలపై పోసి నిప్పంటించి, అనంతరం అక్కడి నుండి జారుకుని పాలకుర్తి వెళ్లి ఆదివారం పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుల అస్థికలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు.
*
తల్లీ కుమారుల మృతదేహాలు కాలి బూడిదయిన దృశ్యం