క్రైమ్/లీగల్

చంచ ల్‌గూడకు జయరాం హంతకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: సంచలనం సృష్టించిన కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసుకు సంబంధించి త్వరలో శిఖా చౌదరికి పోలీసులు నోటీలు జారీచేసి విచారణ చేసే అవకాశం ఉంది. జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పనిమనిషి, వాచ్‌మన్, స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. శిఖా చౌదరి, జయరాం మధ్య ఉన్న సంబందాలపై విచారించినట్లు తెలిసింది. ఈ కేసును లోతుగా విచారించేందుకు ఓ రహస్య ప్రాంతంలో శిఖా చౌదరి పనిమనిషి, వాచ్‌మెన్‌తో పాటు ఆమె స్నేహితలందరినీ పోలీసులు విచారించారు. ఇలా ఉండగా జయరాం హత్యకేసు నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు. నిందితులు రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లను కస్టడీకి తీసుకునేందుకు గాను పోలీసులు పిటిషన్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేయనున్నారు. చిగురుపాటి జయరాం హత్యకేసు తొలుత కృష్ణా జిల్లా నందిగామలో నమోదైన్నప్పటికీ హత్య హైదరాబాద్‌లో జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేసిన విషయం విదితమే. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు మళ్లీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.