క్రైమ్/లీగల్

1500 కేజీల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, మార్చి 20: మండలంలోని జడ్ రాగంపేట గ్రామ శివార్లలో గంజాయి లోడుతో వెళుతున్న లారీని, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి జగ్గంపేట సీఐ కాశీ విశ్వనాధ్ మంగళవారం విలేఖర్లకు వివరాలు తెలియజేశారు. తమకందిన సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా విశాఖపట్టణం వైపునుంచి వస్తున్న ఒక బైకుపై ఇద్దరు వ్యక్తులను, ఒక లారీని అనుమానంతో ఆపగా..వారు పారిపోతున్న సమయంలో ఆ ముగ్గుర్నీ అదుపులోనికి తీసుకున్నట్టు చెప్పారు. మరో ముగ్గురు పరారైనట్టు సీఐ తెలిపారు. ఈ విషయంపై మంగళవారం పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వి రామారావు జడ్ రాగంపేటలో విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటుచేసి వివరాలు తెలిపారు. తమ సిబ్బంది సాహసంతో గంజాయి ముఠాను అదుపులోనికి తీసుకున్నారన్నారు. వీరిలో నర్సీపట్నంకు చెందిన వెల్లంకి గౌరీశంకర్, విజయనగరం జిల్లా మేడపాడు మండలం రాయుడుపేట గ్రామానికి చెందిన ఖసీంకోటి నగేష్, విశాఖపట్టణం జిల్లా ఎస్ రాయవరానికి చెందిన నరవ బాబులను అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు. పరారైన యర్రా దొరబాబు, విజయ్, కార్తీక్‌లను అదుపులోనికి తీసుకోవాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. పట్టుబడ్డ గంజాయి 1500కేజీలని, దీని విలువ సుమారు రూ.30లక్షల వరకూ ఉంటుందన్నారు. ఈ గంజాయిని ఎవరికీ అనుమానం రాకుండా లారీ పైభాగంలో మొక్కజొన్న పొత్తుల బస్తాలను, కింది భాగంలో బస్తాలతో గంజాయిని లోడ్‌చేసినట్టు చెప్పారు. ఇటువంటి గంజాయి స్మగ్లింగ్ సమాచారం ఎవరికి తెలిసినా వెంటనే తమ సిబ్బందికి తెలియజేయాలని, సమాజంలో ఇటువంటి అరాచక శక్తులను అరికట్టేందుకు పోలీసులు ముందుంటారని డీఎస్పీ రామారావు అన్నారు. సమావేశంలో గండేపల్లి తహసీల్దార్ గీతాంజలి, గండేపల్లి ఎస్సై దుర్గాశ్రీనివాస్, ఏఎస్సై వరహాలరాజు, జగ్గంపేట ఎస్సై అలీఖాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.