క్రైమ్/లీగల్

ప్రేమ పేరుతో దగా.. ఆపై హత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 11: పథకం ప్రకారమే కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కడతేర్చి హతమార్చినట్లు మల్కాజిగిరి ఇన్‌చార్జి డీసీపీ ఎన్.దివ్యచరణ్‌రావు తెలిపారు. ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శుశ్రుత హత్య కేసు వివరాలు వెల్లడించారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మచ్చల రమేశ్ వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన శుశ్రుతను 2015 నవంబర్ మాసంలో నగరంలోని బల్కంపేట ఆర్య సమాజంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. శుశ్రుత దళిత యువతి కావటంతో పద్మశాలీ అయిన రమేశ్ కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపకుండా నిరాకరించారు. దీంతో ఇరువురు ఉప్పల్‌లో వేరే కాపురం పెట్టి నివాసం ఉంటున్నారు. వివాహ అనంతరం ఇద్దరి మధ్య గొడవలు రావటం, వాగ్వివాదాలకు దిగటం, తరుచూ జరుగుతుండేదని చెప్పారు. ఈ క్రమంలో గత ఎనిమిది నెలలుగా భర్త నుంచి దూరంగా ఉంటుంది. నాలుగు నెలల క్రితం కుమారుడికి జన్మనివ్వటంతో తన వద్దకు రావాలని, ఉప్పల్‌లో ఇల్లుతీసుకుని కలిసి ఉందామని నమ్మబలికి శనివారం ఉప్పల్‌కు రప్పించుకున్నట్లు తెలిపారు. ముందస్తు పథకం ప్రకారం... ఉప్పల్‌లో ఇళ్లు దొరకటంలేదని, ఘట్‌కేసర్‌లో ఉందామని చెప్పి తన ద్విచక్రవాహనం పై ఔటర్ రింగ్‌రోడ్డు వద్దకు చేరుకున్నట్లు తెలిపారు. భార్య నిద్రమాత్రలు మింగటంతో పాటు తన కుమారునికి నిద్ర మాత్రలు పౌడర్‌గా చేసి పాలలో తాగించిందని, నిద్రలోకి జారుకుని అపస్మారక స్థితిలో వెళ్లగా హత్య చేసేందుకు ఇంకా సులువుగా భావించి కొండాపూర్ గ్రామంలోని ఓ వెంచర్‌లోకి తీసుకువెళ్లి ఊపిరి ఆడకుండా చేసి ఇద్దరిని హతమార్చినట్లు నిందితడు వెల్లడించినట్లు చెప్పారు. అక్కడే కట్టెలు చాలా ఉండటంతో అవుషాపూర్‌లోని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి పెట్రోల్ కొనుగోలు చేసి ఇద్దరి మృతదేహలను దహనం చేసినట్లు వెల్లడించారు. రాత్రి పదిన్నర గంటలకు అక్కడి నుంచి నిష్క్రమించి వరంగల్ జిల్లా పాలకుర్తి పోలీసు స్టేషన్ వెళ్లి లొంగిపోయినట్లు తెలిపారు. విషయం తెలియటంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించినట్లు తెలిపారు. నిందితుడి పై హత్యానేరం, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.