క్రైమ్/లీగల్

కారు ఢీ.. విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, ఫిబ్రవరి 12 : పట్టణ శివారు ప్రాంతంలో డ్రైవర్స్ కాలనీ వద్ద మంగళవారం 42 జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న కుళ్లాయప్ప కుమారుడు కార్తీక్ (8) స్థానిక లక్ష్మీనరసింహ కాలనీలోని యూపీ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తూ రహదారి దాటుతుండగా బూదగవి నుంచి అనంతపురం వెళ్తున్న వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో కార్తీక్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.