క్రైమ్/లీగల్

గాయపడిన యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఫిబ్రవరి 12: మండల పరిధిలోని తోపుదుర్తి సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ధనుంజయను చికిత్స కోసం మంగళవారం బెంగళూరు తరలించగా ఆసుపత్రిలోకి వెళ్ళగానే మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టరం నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన మరో యువకుడు ఓబుళరెడ్డిని కర్నూలు ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
గుడిసె దగ్ధం - రూ.2 లక్షల నష్టం
రొళ్ల, ఫిబ్రవరి 12 : మండల పరిధిలోని లక్కప్పనపల్లి వడ్రహట్టిలో రైతు యల్లమ్మకు చెందిన గుడిసె మంగళవారం దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షలకు పైగా నష్ట వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ఉదయం భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్న పొలంలోకి పనులకు వెళ్లగా ఒక్కసారిగా మంటలు చెలరేగి గుడిసె మొత్తం కాలిపోయిందని, బీరువాలో ఉన్న 4 తులాల బంగారంతోపాటు పట్టాదార్ పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు, పిల్లల విద్యార్హత సర్ట్ఫికెట్లు, దుస్తులు, నగదు దగ్ధమైనట్లు అన్నారు. తనకున్న పాత ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇంటి ఆవరణలో గుడిసె ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిన వెంటనే అక్కడికి వచ్చే లోపే గుడిసె పూర్తిగా దగ్ధమైనట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని తహశీల్దార్ మోహన్‌దాస్ దృష్టికి తీసుకెళ్లారు.