క్రైమ్/లీగల్

కోర్టు పనివేళలు ముగిసేవరకు హాలులో కూర్చోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కోర్టు ధిక్కారం కేసులో సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ మనె్నం నాగేశ్వరరావు, న్యాయ సలహాదారు ఎస్ బాసరంను కోర్టు పనివేళలు పూర్తయ్యే వరకు కోర్టు రూంలో కూర్చోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఒక లక్ష రూపాయల జరిమానాను విధించింది. బిహార్ ముజఫర్‌పుర్ ఆశ్రమంలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీ ఏకే శర్మను బదిలీ చేయవద్దని ఆదేశించినా ఖాతరు
చేయకుండా సీఆర్‌పీఎఫ్ అదనపు డీజీగా బదిలీ చేసినందుకు సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈ కేసులో సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్‌ఎన్‌రావు జారీ చేశారు. ఈ కేసులో న్యాయ సలహాదారుకు కూడా రూ.1 లక్ష జరిమానాను విధించారు. మీ ఇద్దరుకోర్టు హాలులో వెళ్లి సాయంత్రం వరకు కూర్చోవాలి అని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో క్షమాపణలను అంగీకరించే ప్రసక్తిలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో 30 రోజుల పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా లేకపోలేదని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ జోక్యం చేసుకుని తప్పులు చేయడం మానవ సహజం. క్షమించడం దైవత్యం అని ప్రస్తావించారు. ఈ ఇద్దరు అధికారులు క్షమాపణలు చెప్పినా కోర్టు అంగీకరించలేదని కోర్టు పేర్కొంది. గతంలోనే కోర్టు ఈ కేసును దర్యాప్తుచేస్తున్న వారిని బదిలీ చేయవద్దని ఆదేశించినట్లు కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పాటించకుండా బదిలీ చేయడం కోర్టు ఆజ్ఞను ధిక్కరించడమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ చెప్పారు.

చిత్రం.. సుప్రీంకోర్టు * (ఇన్‌సెట్‌లో) మనె్నం నాగేశ్వరరావు