క్రైమ్/లీగల్

మైలార్‌దేవ్‌పల్లిలో లారీ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 12: అతివేగంగా దూసుకువచ్చిన లారీ అదుపుతప్పి మూడు కార్లను ఢీకొట్టిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు మైలార్‌దేవ్‌పల్లిలో అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకువచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.