క్రైమ్/లీగల్

లారీ బోల్తా: బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఫిబ్రవరి 9: మండలంలోని యర్నగూడెంలో శుక్రవారం ఉదయం చేపల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో యర్నగూడెంకు చెందిన గెంజి మురళి (12) సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. విజయవాడ నుంచి చేపల లోడుతోపాటు ఆ పై ఉల్లిపాయలు, నిమ్మకాయల లోడుతో విశాఖ వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న మురళీపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మురళి 7వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుని మృతికి నిరసన తెలుపుతూ యర్నగూడెం గ్రామస్థులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకూ గుండుగొలను- యర్నగూడెం సెంటర్ స్టేట్ హైవేపై టెంట్ వేసి ఆందోళన, రాస్తారోకో చేశారు. సర్పంచ్ గుమ్మడి ప్రసాదరావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ నరాలశెట్టి రాజేంద్రబాబు, దేవరపల్లి విహెచ్‌ఎస్‌ఆర్ అండ్ వీఎల్‌ఎం పీజి అండ్ డిగ్రీ కళాశాల లెక్చరర్ బి కీర్తినారాయుడు, న్యాయవాది ఎండివి ప్రసాద్‌లు ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. విషయం తెలుసుకున్న కొవ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్, దేవరపల్లి ఎస్సై పి వాసు, పోలీసు సిబ్బంది యర్నగూడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ మళ్లింపుపై జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ ఆందోళన విరమించేదిలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు. దేవరపల్లి తహసీల్దార్ వై రవికుమార్ యర్నగూడెం చేరుకుని పరిస్థితిని కొవ్వూరు ఆర్డీవోకు తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆందోళనకారులతో చర్చించి మృతుడు మురళికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరయ్యేలా కృషిచేస్తానని హామీ ఇవ్వడంతో సాయంత్రం 5గంటల సమయంలో ఆందోళన విరమించారు. ఈ లోగా ఏలూరు వైపు వెళ్లే వాహనాలను దేవరపల్లి, యాదవోలు, పోతవరం, నల్లజర్ల మీదుగా మళ్లించారు. ఈ ఆందోళనకు సంఘీభావంగా స్థానిక సెయింట్ జోసఫ్ ఇంగ్లీషు మీడియం విద్యార్థులు రాస్తారోకోలో పాల్గొన్నారు. మృతుని తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి రాస్తారోకోలో పాల్గొన్నారు.