క్రైమ్/లీగల్

వాద్రా ఆస్తులు జప్తు చేసిన ఈడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావమరిది రాబర్ట్ వాద్రా సంస్థకు చెందిన రూ.4.62 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. బికనీర్ భూ కుంభకోణానికి సంబంధించి ఈ ఆస్తులను జప్తు చేశారు. ఇందులో రూ. 18.59 లక్షల విలువ చేసే చరాస్థులు, రూ.4.43 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. ఈ ఆస్తులను న్యూఢిల్లీలోని సుఖదేవ్ విహార్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కేసును ఈడీ అధికారులు 2015లో నమోదు చేశారు. ఈ ఆస్తులు వాద్రాకు చెందిన మెసర్స్ స్కై లైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించారు. ఈ కేసును రాజస్థాన్ పోలీసులు నమోదు చేశారు. కాగా మంగళవారం ఈ కేసులో వాద్రా, ఆయన తల్లి వౌరీన్ జైపూర్‌లోని ఈడీ కోర్టులో హాజరయ్యారు. గత వారంలో ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వాద్రా వచ్చారు. వాద్రాను ప్రియాంక గాంధీ వాద్రా తన కారులో దింపి వెళ్లిన విషయం విదితమే. మనీ లాండరింగ్ కేసులో వాద్రాను పోలీసులు విచారించారు.