క్రైమ్/లీగల్

కటకటాల్లోకి నకిలీ నోట్ల ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 15 : నకిలీనోట్లు తయారుచేసి, చలామణి చేసిన ముఠా సభ్యులను అరెస్టు చేసి, 1.80 లక్షల ఓరిజినల్ నోట్లు, 89,200 రూపాయల నకిలి నోట్లు, కంప్యూటర్, ప్రింటర్, స్కానర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేట పోలిస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నకిలీనోట్ల ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సిద్దిపేట పట్టణం అంబేద్కర్ నగర్‌కు చెందిన గ్యాదరి బాలకృష్ణ, కాముని సురేష్ , మద్దూర్‌కు చెందిన హరినాథ్. పల్లెపుసాయికుమార్, గాగిల్ల పూర్‌కు చెందిన సుంకోజీ శ్రీశైలం, జాలపల్లి గ్రామానికి చెందిన గిరి గోవర్దన్‌రెడ్డి, కూటిగల్ గ్రామానికి చెందిన బండి రఘు, బోయిగూడకు చెందిన అశోక్‌లు ముఠాగా ఏర్పడి నకిలి నోట్లు చలామణి చేస్తున్నట్లు తెలిపారు.
గాగిల్లాపూర్‌లో వెలుగులోకి వచ్చిన నకిలీనోట్లు
మద్దూర్ మండలం గాగిల్లాపూర్‌లో గ్రామైఖ్య సంఘం రోజు వారి కలెక్షన్లు చేస్తుండగా మూడు 200 రూపాయల నకిలీ నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు గుర్తించారు. గ్రామ వెలుగు సీఎ మద్దూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నకిలీనోట్ల చలామణీ బృందాన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంను అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ట్రైనీ ఐపీఎస్ శబారిష్ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. గాగిల్లాపూర్‌లో అనుమానస్పదంగా ఉన్న సుంకోజీ శ్రీశైలంను అదుపులోకి తీసుకొని విచారించారు. నకిలీ నోట్ల తయారి, చలామణికి పాల్పడిన 7గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

ఇట్టి కేసు దర్యాప్తు చేసిన అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ మహేందర్, హబీబ్‌ఖాన్, సిఐ రఘు, రాజిరెడ్డి, కానిస్టేబుళ్లకు రివార్డు అందచేశారు.

అంతర్రాష్ట్ర నకిలీ విలేఖరుల ముఠా అరెస్టు
తెలంగాణ, ఆంధ్రలో వసూళ్లకు
పాల్పడుతున్న ముఠా: డీఎస్పీ శ్రీనివాస్
మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 15: ఇరు తెలుగు రాష్ట్రాల్లో విలేకరులమని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు స్థానిక డిఎస్‌పి పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణం సాగర్ రోడ్డులోని సాయి ప్రశాంత్ పార్‌బాయిల్డ్ రైస్‌మిల్లులో ఈ నెల 6న ఖమ్మం జిల్లాకు చెందిన వేల్పుల మురళి, రావూరి నాగేశ్వరరావు, మండల రామకృష్ణలు వెళ్లి విలేకరులమని, డైరి ఆవిష్కరణ చేస్తున్నామని డబ్బులు ఇవ్వాలని మిల్లు యజమానికి ఫోన్ చేసి చెప్పడం జరిగిందని తెలిపారు. డబ్బులు ఇవ్వకుంటే మిల్లులో జరుగుతున్న తప్పుడు కార్యక్రమాల గురించి రాస్తామని బెదిరించగామిల్లు గుమాస్తా వారికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ విషయం తెలుసుకున్న విలేకరుల పేరు బద్నాం చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని స్థానిక విలేకరులు ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఖమ్మంకు వెళ్లి ముగ్గురు మురళి, నాగేశ్వరరావు, రామకృష్ణలను అరెస్టు చేసి వారు వచ్చిన కారు, 3 సెల్‌ఫోన్‌లు, రూ.8,000లు స్వాధీనం చేసుకుని ఐపిసి సెక్షన్ 420, 384 కింద కేసులు నమోదు చేశామన్నారు. సిసి ఫుటేజ్ ద్వారా నిందితుల ఆచూకి తెలుసుకున్నామన్నారు. వారిని ఖమ్మంలోని రావూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద అరెస్టు చేసినట్టు తెలిపారు. వారు ఖమ్మం, ఏపి రాష్ట్ర జగ్గయ్యపేట, నకిరేకల్లులో కూడ బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు ఇంటరాగేషన్‌లో తెలిపారన్నారు. స్వల్ప కాలంలో నిందితులను అరెస్టు చేసిన ఒన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ సిహెచ్.సదానాగరాజు, ఎస్‌ఐ ఎ.రాములు, కానిస్టేబుళ్లు కొమ్ము రవి, మెండు అంజయ్య, హోంగార్డు కోడిరెక్క కిరణ్‌లను డిఎస్‌పి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను సైతం అనే కార్యక్రమం కింద పలు ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల అనతి కాలంలోనే నేరాలను అదుపు చేయగలుగుతున్నామన్నారు. వ్యాపారులు, ఇతర సంస్థల వారు సిసి కెమెరాలను పెట్టుకుని నేరాల అదుపుకు సహకరించాలన్నారు. ఎవరైనా విలేకరుల ముసుగులో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు.