క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 16: రోడ్డు ప్రమాదం కేసులో ద్విచక్ర వాహనదారుడి నుంచి రెండు వేల రూపాయల లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు రాయదుర్గం సబ్ ఇన్‌స్పెక్టర్ చిక్కాడు. ఏసీబీ డీఎస్‌పీ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో టూవీల్ క్యాబ్ డ్రైవర్.. పాసింజర్‌ని తీసుకుని వెళ్తుండగా ఖాజగూడ చౌరస్తాలో వాహనం స్కిడై ప్రమాదం జరిగింది. ప్రయాణికుడికి స్వల్ప గాయం కావడతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసుకు సంబంధించి ద్విచక్ర వాహనం క్యాబ్ డ్రైవర్ మురళి వరప్రసాద్‌కు స్టేషన్ బెయల్ కోసం ఐదు వేల రూపాయలు ఇవ్వాలని రాయదుర్గం ఎస్‌ఐ శశిధర్ ఒత్తిడి చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు చేసి జైలుకు పంపిస్తాని బెరించించాడు. నాలుగు వేల రూపాయలకు బేరం కుదరడంతో ప్రమాదం జరిగిన రోజునే రెండు వేల రూపాయలు ఇచ్చాడు. మిగిలిన రెండు వేల రూపాయలను పోలీసు స్టేషన్‌లో ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పటుకున్నారు. తదుపరి విచారణ కోసం ఎస్‌ఐ శశిధర్‌ని అదుపులోకి తీసుకున్నారు.