క్రైమ్/లీగల్

జయరాం హత్య కేసులో మరో సీఐపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఎన్నారై, పారిశ్రామిక వేత్త చిగురిపాటి జయరాం హత్య కేసులో ఇక పోలీస్ అధికారులను విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డితో సంబంధాలు ఉన్న ఎసీపీ( ఇబ్రహీంపట్నం), నల్లకుంట సీఐ శ్రీనివాస్, రాయదుర్గం సీఐ రాంబాబులపై బదిలీ వేటు పడింది. జయరాం హత్య తర్వాత నిందితుడు రాకేష్‌రెడ్డి దాదాపు 11మంది పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయం కేసు దర్యాప్తు చేస్తున్న అధికారలకు పక్కా సమాచారం అందిందని తెల్సింది. దీంతో ఇక పోలీస్ అధికారులను ఇంటరాగేషన్ చేయాలని, అందకు వచ్చే సోమవారం దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లో భయాందోళన వ్యక్తం అవుతున్నాయి. జయరాం హత్య విషయాన్ని తెలిసిన తర్వాత కూడా నిందితున్ని పట్టకోవడానికి రాయదుర్గం సీఐ రాంబాబు ప్రయత్నించకపోవడాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య విషయం హైదారాబాద్‌లో తెలిస్తే కేసుల్లో సహకరించలేమని పోలీస్ అధికారులు రాకేష్‌రెడ్డికి సూచించారని అభియోగాలు నమోదు అయ్యాయి. అలాగే హత్య ఘటన అంశాలు బయటికి వస్తే తమ ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని రాకేష్‌రెడ్డికి స్వయంగా ఎసీపీ, సీఐలు చెప్పడం జరగిందన్నారు. హత్య గుట్టును బయటకు రాకుండా జయరాం శవాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించాలని సూచించారు. దీంతో జయరాం శవాన్ని జనవరి 31న రాత్రి విజయవాడ సమీపంలో నందిగామ వద్ద శవంతో ఉన్న కారును వదిలేసి, నిందితుడు రాకేష్‌రెడ్డి హైదరాబాద్‌కు బస్సులో చేరుకున్నాడు. రాకేష్‌రెడ్డిని విచారించడానికి మరో 8 రోజులు పోలీస్ కష్టడీకి అప్పచెప్పాలని నాంపల్లి కోర్టులో జూబ్లీహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. జయరాం కేసులో సినీ నటులు, రియల్ ఎస్టేట్ వ్యాపాలు, రౌడీ షీటర్లును దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు.