క్రైమ్/లీగల్

సెజ్ భూముల పిటిషన్‌పై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక మండళ్ల (సెజ్)లో నిరుపయోగంగా ఉన్న భూములపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్, వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సెజ్‌లలోని భూముల పర్యవేక్షణ బాధ్యత కేంద్రానిదేనని పలు రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేశాయి. మరోవైపు సెజ్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రమే తయారు చేస్తామని, భూమికి సంబంధించిన విషయం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు కొలిన్ గొంజాల్వెస్, న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఏపీలో సుమారు నాలుగు వేల హెక్టార్ల సెజ్ భూములు నిరుపయోగంగా ఉన్నాయని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.