క్రైమ్/లీగల్

పంజాబ్ ఐజీని అరెస్టు చేసిన సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీఘ్ఢ్, ఫిబ్రవరి 18: పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లా బెహ్‌బాల్ కలాన్, కొట్కాపురాలో 2015లో సిక్కుల అల్లర్ల కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పరమ్‌రాజ్ సింగ్ ఉమ్రంజల్‌ను సోమవారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. మతగ్రంథాలను కించపరిచేలా వ్యవహరించిన ఘటనకు వ్యతిరేకంగా పలువురు సిక్కులు ఆందోళనలకు దిగారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర విచారణ చేపట్టగా, మెగా జిల్లా మాజీ ఎస్‌ఎస్‌పీ ఛత్రంజిత్ సింగ్ శర్మ పోలీస్ కాల్పులతో సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో గత నెలలో అతనిని సిట్ అధికారులు చేశారు. ‘బెహ్‌బాల్ కలాన్‌లో సిక్కు ఆందోళనకారులపై కాల్పులు జరగడానికి అప్పట్లో లూధియానా పోలీస్ కమిషనర్, ప్రస్తుత పంజాబ్ ఐజీ పరమ్‌రాజ్ సింగ్ ఉమ్రంజల్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. అందుకే అతనిని అరెస్టు చేశాం’ అని సిట్ సభ్యుడు కున్వార్ విజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. సిక్కులపై కాల్పులు జరిగిన తర్వాత తనకున్న అధికారంతో అన్నివర్గాలను పరమ్‌రాజ్ సింగ్ తనకు అనుకూలంగా మార్చుకున్నారని, తాము దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెల్లడి కావడంతో అరెస్టు చేశామని సిట్ సభ్యుడు కున్వార్ విజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.