క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన మైనర్ ఇరిగేషన్ ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, ఫిబ్రవరి 18: ఓ గుత్తేదారుకు సంబంధించి నీరు చెట్టు పనుల బిల్లులు మంజూరుకు రూ.2 లక్షలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా గడివేముల ఇరిగేషన్ ఏఈ రాజశేఖర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. గుత్తేదారు రమణారెడ్డి తాను చేపట్టిన నీరు చెట్టు పనుల బిల్లుల కోసం నంద్యాల మైనర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ పరిధిలోని గడివేముల ఏఈ రాజశేఖర్‌ను కలవగా ఆయన రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం రమణారెడ్డికి రూ.2 లక్షలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు సిబ్బందితో దాడులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏఈ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.6 లక్షల నగదు లభించింది.