క్రైమ్/లీగల్

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, మార్చి 22: మండల పరిధిలోని రేగల్లు గ్రామం బోయపల్లెలో ఈనెల 15న జరిగిన మహిళ హత్యకేసులో ఆమె భర్తను అరెస్టు చేసినట్లు సీఐ వేణుగోపాల్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోయపల్లెలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం తన భార్య పార్వతమ్మ గత కొంతకాలంగా కువైట్‌కు వెళ్లి తిరిగి వచ్చింది. భార్య పార్వతమ్మ ఎవరితోనే ఫోన్లో తరచూ మాట్లాడటం గమనించి ఆమెతో భర్త సుబ్రహ్మణ్యం గొడవపడేవాడు. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం ఎవరూలేని సమయంలో ఇంటిలోని కొడవలితో భార్య మెడపై నరికి హత్య చేసి పరారయ్యాడు. గురువారం ఉదయం పీలేరు-సదుం మార్గమధ్యంలో గార్గేయ నది ప్రాజెక్టు వద్ద నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి, సుమన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.