క్రైమ్/లీగల్

చింతమనేనిపై కుట్రలో భాగంగానే వీడియో అప్‌లోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా వైసీపీ కార్యకర్త ఒకరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియోను తాను అప్‌లోడ్ చేశానని ఒప్పుకున్నాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. శుక్రవారం నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యే ప్రభాకర్ వీడియోపై 24గంటల్లోపు నివేదిక ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు. వాస్తవంగా గత నవంబర్ 14న దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ సీతారామవరం గ్రామంలో సీసీరోడ్ల ప్రారంభానికి వేసిన శిలాఫలకాన్ని కొందరు ప్రత్యర్థులు పగలగొట్టారన్నారు. దీనిపై గ్రామంలో ఆయన మాట్లాడుతూ దళితులపై ఉన్న గౌరవంతో దళితులు వెనుకబడిన వారని, మీలో మీకు గొడవలు ఎందుకని, రాజకీయాలుంటే తామే చూసుకుంటామని చెప్పారన్నారు. పార్టీ పిలిపిస్తే తప్ప మిమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం లేదని, రూ. 80వేలు చేసే గేదెలను దళితులకు రూ. 15వేలకే ఇస్తున్నామన్నారని తెలిపారు. అయితే కే రవికుమార్ అనే వ్యక్తి ఈ వీడియోనే అటూఇటూగా మార్చి దళితులను కించపరిచినట్లు వ్యాఖ్యలను పోస్ట్ చేశారన్నారు. వీడియోను మార్ఫింగ్ చేయటం వైసీపీ కుట్రలో భాగమని పోలీసు విచారణలో తేలిందన్నారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ పరీక్షకు పంపామన్నారు. నిందితుడు రవికుమార్ నిజాలను ఒప్పుకుని ఎక్కడ పోస్ట్ చేసింది, ఏవిధంగా మార్ఫింగ్ చేసింది ఒప్పుకున్నాడని తెలిపారు. రాష్ట్రాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశ్యంతోనే వైసీపీ దుర్మార్గంలో భాగంగానే ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తోందని వివరించారు.