క్రైమ్/లీగల్

బాల కార్మికులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, : మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి గ్రామ సమీపంలో హిమాయత్ సాగర్ వద్ద భారీ ఎత్తున అక్రమంగా ఇటుకబట్టీలు నిర్వహిస్తున్న పది మంది యజమానులు మైనర్ కార్మికులతో పని చేయించుకుంటున్నట్లు తెలుసుకున్న జిల్లా చైల్డ్ ప్రొటెక్ యూనిట్ టీం అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాయుడు అనే యజమానితో పాటు స్థానికులు తొమ్మిది మంది కలిసి అధికారులతో కుమ్మకై వందల టిప్పర్లతో హిమయత్ సాగర్‌లోని మట్టిని తవ్వుతూ.. భారీ ఎత్తున్న ఇట్టుకబట్టీలను నిర్వహిస్తున్నారు. ఈ బట్టీలలో మైనర్ కార్మికులు పని చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చింది. దాడులు చేసి ఇరవై మంది మైనర్లను విడిపించి విముక్తి కలిగించారు. సీఐ వెంకటేష్ మాట్లాడుతూ బాల కార్మికలను చట్టానికి వ్యతిరేకంగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుబడిన వారిలో 14 మంది బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారని, వీరిని స్టేట్ హోమ్‌కు తరలించిన్నట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైలు సురేష్, శ్రీ్ధర్ పాల్గొన్నారు.