క్రైమ్/లీగల్

షాపింగ్ మాల్‌కు రూ.5లక్షలు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: నగరంలోని ఓ షాపింగ్ మాల్‌కు విజయవాడ కన్స్యూమర్స్ ఫోరం ఝలక్ ఇచ్చింది. అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న పీవీఆర్ మాల్‌కు వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి ఆర్ మాధవరావు శుక్రవారం 5లక్షల రూపాయల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని వినియోగదారుల ఫోరం సంక్షేమ నిధికి జమ చేయడంతో పాటు చెల్లించిన పార్కింగ్ ఫీజు 40రూపాయలు, ఖర్చుల నిమిత్తం రూ. 5వేలు ఫిర్యాదుదారునికి అందచేయాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు మాల్స్, మల్టీఫ్లెక్స్‌ల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ మున్సిపల్ కమిషనర్, జిల్లా జాయింట్ కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ప్రతినిధి ఎంవీ శ్యామ్‌సుందర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకనుంచి ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

నగరంలో ప్రారంభమైన ‘రక్ష’
* శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రకటించిన రక్ష కార్యక్రమం ద్వారా ‘శానిటరీ నాప్‌కిన్స్’ పంపిణీ కార్యక్రమాన్ని తొలిగా విజయవాడ నుంచి ప్రారంభించారు. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టెర్ లుక్కా సాయిరాం గౌడ్ నగరంలోని ఆర్టీసీ కాలనీలో రేషన్ షాపు నుంచి పంపిణీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద వర్గాలకు ఉచిత రేషన్ ఇవ్వడమే కాకుండా మహిళలకు ‘రక్ష’ కార్యక్రమం ద్వారా ఉచితంగా, రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరికీ 10రూపాయల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద వర్గాల ఆరోగ్యం పట్ల అవగాహన, శుభ్రత పట్ల తీసుకుంటున్న శ్రద్ధ ప్రజలందరూ గుర్తించాలని, రక్ష పథకాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ అధికారి శ్యామ్‌కుమార్, ఆర్‌ఐ రమేష్, కార్పొరేషన్ జాస్తి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.