క్రైమ్/లీగల్

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 22 : స్థానిక కెనరా బ్యాంకు ఏటీఎంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించారు. అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దొంగలు సీసీ కెమెరాల దిశ మార్చి ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. అయినప్పటికీ ఏటీఎం యంత్రం తెరుచుకోకపోవడంతో అసహనానికి గురై యంత్రాన్ని వెలుపలకి తీసుకొచ్చి విఫలయత్నం చేశారు. బయటే ఏటీఎం యంత్రాన్ని వదిలి వెళ్లినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగశివారెడ్డి తెలిపారు.