క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర దొంగల మూఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 23: వరంగల్ నగరంలోని పలు సంపన్న కాలనీలో అద్దెకు ఉంటూ పగటి పూట దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల మూఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుప్పుట్లు, బట్టల అమ్మకాల ముసుగులో పగటిపూట చోరీలకు పాల్పడుతున్న ఈ అంతర్రాష్ట్ర దొంగల మూఠాను చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. వివరాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ముఠా సభ్యుల నుండి 27లక్షల రూపాయల విలువగల 900 గ్రాముల బంగారు అభరణాలు, ఐదువేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, చోరీలకు వినియోగించే సాధనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా జిల్లా, టాంగ్రా గ్రామానికి చెందిన రఫీకుల్ (30), రోకస్ షేక్ (37), ఓహిదుల్ మొల్లా (33), జుంతోటి మొల్లా (26) అనే నలుగురు నిందితులు దుప్పట్లు, బట్టలు అమ్ముకునేవారు. అదును చూసుకుని తాళం వేసి ఉన్న ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడేందుకు సిద్దపడ్డారు. నిందతులు చోరీ చేసిన సొత్తులో కొంత భాగాన్ని వరంగల్ నగరంలోని బులియన్ మార్కెట్‌లో అమ్మేందుకు వస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న సిసిఎస్ సిఐలు డేవిడ్‌రాజ్, రవిరాజు తమ సిబ్బందితో కలిసి వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులు రఫికుల్ షేక్, రోకస్ షేక్‌లు శివనగర్‌నుండి నడుచుకుంటూ వస్తుండగా పోలీసులను చూసి పరిగెత్తేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే పట్టుకుని పంచుల సమక్షంలో తనిఖీ చేయడంతో నిందతుల వద్ద బంగారు అభరణాలను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో శివనగర్ ప్రాంతంలోని ఇంటిలో నివాసం ఉంటున్న మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారినుండి బంగారు అభరణాలు, ఐదువేల రూపాయ ల నగదు చోరీలు చేయడానికి వినియోగించే సాధనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ అభినందించారు.