క్రైమ్/లీగల్

యూపీలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భదోహి, ఫిబ్రవరి 23: ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో సంభవించిన పేలుడులో 13 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం ఒక షాపులో సంభవించిన ఈ పేలుడు వల్ల పక్కనున్న మూడు ఇళ్లు కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్టు భావిస్తున్నామని, వారిని రక్షించడానికి సహాయక చర్యలు ప్రారంభించామని వారు వివరించారు. రోహ్‌తా బజార్‌లోని ఒక షాపులో ఈ పేలుడు చోటు చేసుకుంది. మృతి చెందిన పది మందిలో ఆ షాపు నడుపుతున్న కలియార్ మన్సూరి కూడా ఉన్నాడు. అతని కుమారుడు ఆ షాపు వెనుక కార్పెట్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు కూడా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్టు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మన్సూరి అక్రమంగా టపాకాయల తయారీ వ్యాపారం కూడా చేశాడని స్థానికులు చెప్పారు. మన్సూరితో పాటు మరో ముగ్గురు మృతులను ఇర్ఫాన్ మన్సూరి, ఆబిద్ మన్సూరి, చందుగా గుర్తించారు. మరో ఆరుగురిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, సీనియర్ జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారని ఆయన వివరించారు.