క్రైమ్/లీగల్

కేసు కాపీలు ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు కావాలంటూ శనివారం నాడు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. భూముల కొనుగోలు, మనీలాండరింగ్‌కు సంబంధించి వాద్రా ఇప్పటికే పలుమార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి ధృవపత్రాలు ఈడీ నుంచి ఇప్పించాలంటూ ప్రత్యేక న్యాయమూర్తి అర్వింద్ కుమార్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 25న పిటిషన్ విచారణకు రానుంది. సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసీ ఈ పిటిషన్ వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బావ రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ, జైపూర్‌లో ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో భూ కుంభకోణం, విదేశాల్లో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాద్రా మధ్యంతర బెయిల్ గడువు మార్చి 2 వరకూ అమల్లో ఉంటుంది.