క్రైమ్/లీగల్

యథాతథ స్థితిని కొనసాగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్) ఆస్తులను అతని సోదరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు విక్రయించడంపై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఆస్తుల విక్రయ ప్రక్రియను నిలిపివేస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
అయితే, ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ జారీ చేసిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఆర్‌కామ్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ మార్చి 8న బొంబాయి హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మార్చి 28లోపు ఎలాంటి అఫిడవిట్లనయినా, రాతపూర్వక విజ్ఞాపనలనయినా సమర్పించడానికి ఈ కేసులోని పక్షాలకు స్వేచ్ఛ ఉందని న్యాయమూర్తులు ఆదర్శ్ గోయెల్, యూయూ లలిత్, ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులోని అన్ని పక్షాలు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూనే, ఈ అంశం తుది విచారణ తేదీని ఏప్రిల్ 5గా ఖరారు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
వేగవంతంగా పూర్తి: ఆర్‌కామ్
అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఆర్‌కామ్ తన ఆస్తుల విక్రయ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన కొద్ది సేపటి తరువాత ఆర్‌కామ్ స్పందిస్తూ, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విధించిన గడువు ఆగస్టు 31లోగా తన ఆస్తుల విక్రయ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది.