క్రైమ్/లీగల్

పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / బేగంపేట: సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థి ఇంటర్ పరీక్ష రాస్తూ కుప్పకూలి మృతి చెందాడు. రాంగోపాల్ పేట్ పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ వైఎంసీఏ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎం గోపిరాజ్ (18) ఒకేషనల్ కోర్సులో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం పరీక్ష హల్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గోపిరాజ్ తండ్రి వెంకట్రావుఖమ్మం జిల్లా ఇతరుమలాయపాలెం కోక్కిరెని గ్రామానికి చెందిన చెందిన వారు. బతుకుదెరువుకోసం కోసం 15 సంవత్సరాల క్రితం నగరంలోని అమీర్‌పేట్ ఎల్లారెడ్డి గూడకు వచ్చాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తూ సాగిస్తున్నారు. వెంకట్రావుకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. గోపిరాజ్ నాలుగో సంతానమని ఎస్సై కే ప్రతాప్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పెరుగన్నం తిన్న గోపిరాజ్ పరీక్షా సమయం దగ్గరపడుతుందని మహేష్ అనే స్నేహితుడితో కలిసి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. అప్పటికే సమయం పరీక్షా సమయం మించిపోతోంది. తనకు చాతిలో నొప్పిగా ఉందని స్నేహితుడితో చెప్పాడు. మెడికల్ షాపుకు వెళ్లి చెప్పగా ఓ ట్యాబ్‌లెట్ ఇచ్చారు. గోపిరాజ్‌కు అప్పటికే ఓసారి వాంతులు కాగా, ఆ తరువాత ట్యాబ్‌లెట్ వేసుకుని పరీక్షా కేంద్రానికి హాజరైన్నట్లు పోలీసులు తెలిపారు. చాతిలో నొప్పి వచ్చినపుడే డాక్టర్ దగ్గరకు వెళ్లి ఉంటే దారుణం జరిగి ఉండేది కాదని తండ్రి వెంకట్రావు కన్నీరు మున్నీరు అయ్యాడు.