క్రైమ్/లీగల్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ జరిమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, మార్చి 2: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పలు పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడిన వారికి లోక్ అదలాత్‌లో భారీ మొత్తంలో జరిమానాలు విధించారు. లోక్ అదలాత్‌లో నిర్వహించిన సుమారు 352 కేసులకు గాను అందులో ఒకొక్కరికి రూ.2 వేలు జరిమానా, అధారిత పత్రాలు లేనందున 181 మందికి ఒక్కోక్కరికి రూ.500 జరిమానా విధించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 13 మందికి ఒక్కొక్కరికి రూ.1000లు జరిమానా విధించారు. మొత్తం రూ.807500 జరిమానా విధించారు. బాలానగర్ ట్రాఫిక్ నుంచి 42, కూకట్‌పల్లి ట్రాఫిక్ నుంచి 86, మాదాపూర్ ట్రాఫిక్ నుంచి 103 , మియాపూర్ ట్రాఫిక్ నుంచి 64, గచ్చిబౌలి ట్రాఫిక్ నుంచి 57, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, బాలానగర్ ట్రాఫిక్ నుంచి 11, కూకట్‌పల్లి ట్రాఫిక్ నుంచి 63, మాదాపూర్ ట్రాఫీక్ నుంచి 47, మియాపూర్ ట్రాఫిక్ నుంచి 33, గచ్చిబౌలి ట్రాఫిక్ నుంచి 25, సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు 13 ఇందులో ఆరుగురు మహిళలు ఉన్నారు.
గడ్డివాము దగ్ధం
కొత్తూరు రూరల్, మార్చి 2: గడ్డివాము దగ్ధమైన సంఘటనలో రూ.80వేల ఆస్తినష్టపోయినట్లు రైతు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం కొత్తూరు మండలం ఫాతిమాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వరిగడ్డి వాము ప్రమాదావశాత్తు నిప్పు అంటుకొని పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు.షాద్‌నగర్ ఫైర్‌స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. ఫైరింజన్ సంఘటన స్థలానికి చేరుకొనేలోపే వరిగడ్డి పూర్తిగా దగ్ధపోయింది.