క్రైమ్/లీగల్

సిద్దిపేట కోర్టుకు రేవంత్‌రెడ్డి హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 2 : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి శనివారం సిద్దిపేట జిల్లా కోర్టుకు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండ రంగనాయక్ సాగర్ భూ నిర్వాసితుల దీక్షలకు 2015 నవంబర్ 11న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంఘీభావం ప్రకటించి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులపై అసభ్య పదజాలం వాడారని టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు చిన్నకోడురు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 153, 188 (34) సెక్షన్‌లో కేసు నమోదు చేశారు. కేసుపై వారెంట్ జారీ చేయటంతో సిద్దిపేట జిల్లా కోర్టుకు టీపీసీసీ వర్కింగ్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఏప్రిల్ 18కి కేసును వాయిదా వేసినట్లు రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది తాటికొండ రమేశ్ తెలిపారు.