క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, మార్చి 2: వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాడ సంపత్ శనివారం మధ్యాహ్నం ఐదువేలు లంచం తీసుకుంటుండగా ఏసీబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాయపర్తి గ్రామానికి చెందిన పార్నం శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు తన కూతురు వివాహం చేసాడు. కళ్యాణలక్ష్మి పథకం కోసం ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసి, నెలరోజులుగా మంజూరు కోసం తిరుగుతున్నాడు. దీంతో విసిగిపోయిన శ్రీనివాస్‌రెడ్డి ఆర్‌ఐని స్కీంకు సంబంధించిన తమ ఫైల్‌ను ఎందుకు ఆపుతున్నారని అడిగాడు. దీంతో ఆర్‌ఐ ఐదువేలు ఇస్తేనే మీకు స్కీం మంజూరు అవుతుందని చెప్పడంతో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబి అధికారులను ఆశ్రయించాడు. ఏసీబి అధికారుల సూచన మేరకు రైతు శ్రీనివాస్‌రెడ్డి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఆర్‌ఐ మాడ సంపత్‌ను కలిసి ఐదువేల రూపాయలు ఇచ్చాడు. అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబి డిఎస్పీ బద్రయ్య, ఇన్‌స్పెక్టర్లు క్రాంతి కుమార్, వెంకట్, సిబ్బందితో కలిసి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంపత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా సంపత్‌పై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.