క్రైమ్/లీగల్

జువైనల్ హోమ్‌కు నలుగురు బాలుర తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 3: జువైనల్ హోమ్‌కు నలుగురు మైనర్ నిందితులను బాచుపల్లి పోలీసులు తరలించారు. వరంగల్‌కు చెందిన మంచాల తారక సాయికృష్ణ (22) బాచుపల్లి మండలం ప్రగతినగర్ గ్రామంలోని శివసాయి బాలాజీ రెసిడెన్సీలో నివాసముంటున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్న సాయికృష్ణ.. ఫిబ్రవరి 27న తన స్వస్థలమైన వరంగల్‌కు వెళ్లేందుకు ప్రగతినగర్ ఎలిఫెంట్ చౌరస్తాలో జేఎన్‌టీయూకు వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మార్గమధ్యలో హెరిటేజ్ సూపర్ మార్కెట్ వైపు తీసుకువెళ్తుండగా అనుమానంతో సాయికృష్ణ ప్రశ్నించగా ఓ వ్యక్తిని దింపాలని సమాధానమిచ్చాడు. కొద్ది దూరం వెళ్లిన ఆటోలోని నలుగురు వ్యక్తులు కలిసి సాయికృష్ణ వద్ద ఉన్న బంగారు గొలుసును, రూ.వెయ్యి నగదును తీసుకుని అక్కడే దింపి ఎవరికైనా చెబితే ఊరుకోమని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసునమోదు చేసుకుని ఈనెల 2న బంగారు గొలుసును భాగ్యనగర్ కాలనీ బస్టాండ్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. నలుగురు మైనర్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి బంగారు గొలుసుతో పాటు నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీన పరుచుకుని జువైనల్ హోమ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో మియాపూర్, మాదాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న వ్యక్తుల సెల్‌ఫోన్‌లను లాక్కొని పరారైన కేసులో నిందితులని పోలీసులు తెలిపారు.