క్రైమ్/లీగల్

భవనం పైనుంచి దూకి మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మార్చి 3: అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు పైనుంచి నవవధువు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. శనివారం ఉదయం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుష్మా సాయినగర్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. సైదాబాద్ ప్రాంతానికి చెందిన పడాల పృథ్విరాజు, సబిత దంపతులకు చెందిన నివేదిత (29)తో సుష్మా సాయినగర్‌లో నివాసం ఉంటున్న భువనగిరి జ్ఞాన్‌ప్రకాష్, నిమ్మిరాణి దంపుతులకు చెందిన రఘుప్రసాద్‌కు 2017 జులై నెలలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రఘు ప్రసాద్ మాదపూర్ ప్రాంతంలోని ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి రఘు ప్రసాద్, నివేదిత.. సుష్మా సాయినగర్ కాలనీలోని అపార్ట్‌మెంటులో నాల్గోవ అంతస్తులో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఐదవ అంతస్తు పైకి వెళ్లిన నివేదిత ఒక్కసారిగా భనవంపై నుంచి కిందికి దూకింది. వెంటనే గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త రఘు ప్రసాద్, అత్తమామలు భువనగిరి జ్ఞాన్ ప్రసాద్, నిమ్మిరాణిను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
వరకట్నం వేధింపులు..
ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగిన తన కూతురును అల్లుడు, రఘు ప్రసాద్, అత్తమామలు నిత్యం అదనపు వరకట్నం కోసం తీవ్రంగా వేధించే వారని మృతిరాలి తండ్రి పృథ్విరాజు ఆరోపించారు.