క్రైమ్/లీగల్

భారీగా బంగారం,నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: నగరంలో కరడుగట్టిన ముగ్గురు దొంగలను రెండు వేర్వేరు కేసుల్లో నగర పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తుంటారు. వీరిలో ఒకరు పట్టపగలే ఇళ్ల తాళాలు పగుల గొట్టి చోరీలు చేయడంలో దిట్ట. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోడిశెట్టి ఆనంద్‌కుమార్ అలియాస్ నందు (43) బాగ్‌అంబర్‌పేటలో ఉంటాడు. నిరుద్యోగిగా ఉన్న నందు దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు. పగలే ఇళ్ల తాళాలు పగులగొట్టి ఇంట్లో ప్రవేశించి దొరికినదంతా ఎత్తుకెళతాడు. నల్లకుంటలో ఎం.సముద్ర అనే మహిళకు చెందిన ఇంట్లో పట్టపగలే దొంగతనం చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నల్లకుంట పోలీసులకు నిందితుడు చిక్కాడు. నిందితుడి నుంచి 25 తులాల బంగారం, రూ.4.57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2001 నుంచి 2015 వరకు 20 కేసుల్లో నందు నిందితుడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నల్గొండ జిల్లాల్లో నేరాలకు పాల్పడ్డాడు. నిందితుడిని గురువారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మరో కేసులో రాజస్ధాన్‌కు చెందిన జగదీశ్‌గిరి, ప్రవీణ్‌సింగ్‌లను ఆఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరి నుంచి రూ.10,63,550 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా రామోల్ పోలీసులు పట్టుకుని ఆఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించినట్లు సిపి వెల్లడించారు. ఇటీవల నగరంలో ప్రిన్స్ పేపర్ ట్రేడర్స్‌లో తాడు సహాయంతో దిగి నగదు దోచుకున్నారు. రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో అంతా నిద్రలో ఉన్న సమయంలో జగదీశ్ తాడు సహాయంతో దుకాణంలో దిగి అనంతరం దొరికింది దోచుకుని పరారయ్యారు. ఇలా ఇద్దరు కలిసి నగదు దోచుకుని బస్‌లో రాజస్ధాన్‌కు పరారయ్యారు. నిందితుల గురించి విచారించగా వారు రాజస్ధాన్‌కు వెళ్లినట్లు బస్‌లో ఎక్కిన సమాచారం, ఇతర వివరాలు అన్నీ సేకరించారు. దీంతో వారి సహకారంతో అరెస్టు చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్‌సిస్ట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకు వచ్చారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.