క్రైమ్/లీగల్

పోలీసుల విస్తత్ర తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, మార్చి 22: మండల పరిధిలోని తుంకిమెట్లలో పోలీసులు గురువారం రాత్రి విస్త్రుత తనిఖీలు చేపట్టారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా గ్రామంలో తనిఖీ చేయగా 19 బైక్‌లు, నాలుగు ఆటోలతో పాటు 32 బెల్లం ముద్దలు, గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆడిషనల్ ఎస్పి పరమాల నర్సింలు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలో పరిగి డివిజన్ పరిధిలోని ఇద్దరు సిఐలు, ఏడుగురు ఎస్‌ఐలు, 65 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గోన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేరాల సంఖ్యను అదుపు చేయడంలో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నామని, పాత నేరస్తులను విచారిస్తున్నామని, తద్వార చోరికి గురైన వాహనాలు లభ్యం కావడంతో పాటు నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. తుంకిమెట్ల గ్రామానికి చెందిన రహీం దగ్గర 32 బెల్లం ముద్ద లు లభ్యమైయ్యాయి. అలాగే రజాక్ దగ్గర గుట్కప్యాకెట్‌లు దొరకడంతో పోలీసులు స్వాధినం చేసుకున్నారు. తనిఖీలో పరిగి డిఎస్‌పి శ్రీనివాసులు, కొడంగల్ సిఐ శంకర్, పరిగి సిఐ ఏవీ రంగాతో పాటు పరిగి డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.