క్రైమ్/లీగల్

పశువుల చోరీ కేసులో నలుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, మార్చి 5: రాత్రి సమయాల్లో వ్యవసాయ పొలాల వద్ద నుంచి పశువులను చోరీ చేసే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నందిగామ పోలీస్‌స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. మహ్మద్ హస్మత్(32), మహ్మద్ ఇలియాస్ ఖురేషీ (35), మహ్మద్ ఫిరోజ్‌ఖాన్(25), మహ్మద్ అమీర్ ఖురేషీ(24) కలిసి రాత్రి సమయంలో వ్యవసాయ్చచచీ పొలాల వద్ద కట్టి ఉంచిన పశువులను దొంగిలించి, వాహనంలో తరలించేవారు. కర్ణాటక వాసులైన రాజేంద్రనగర్ సమీపంలో నివాసముండేవారు. నందిగామకు చెందిన శివగల్ల రాములు వ్యవసాయ పొలం వద్ద రెండు పశువులను దొంగిలించి పరారయ్యారు. శివగల్ల రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మేకగూడ జంక్షన్ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. రూ.3.75లక్షలతో పాటు నాలుగు సెల్‌ఫోన్లు, మహీంద్ర కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. షాద్‌నగర్ రూరల్ సీఐ రామకృష్ణ, సీసీఎస్ సీఐ చంద్రబాబు, నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ అభినందించారు.