క్రైమ్/లీగల్

నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, మార్చి 5 : శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తమతమ ఇళ్లకు బయలుదేరిన వారు మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బోలేరో వాహనం బోల్తాపడిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల, కర్నూలు, రాయచోటి ప్రాంతాల భక్తులు మహశివరాత్రి పండగ రోజు సోమవారం పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం వారు బొలెరో వాహనంలో శ్రీశైలం నుంచి కర్నూలు వస్తుండగా నల్లమల అటవీ ప్రాంతంలోని దోర్నాల మండలం చింతల గ్రామ సమీపంలో, ముందు వెళుతున్న కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం జరిగింది. అయతే, అదుపుతప్పిన బొలేరో బోల్తాపడింది. ఈ ఘటనలో బొలేరోలోని ముగ్గురు మరణించగా, 17 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా గట్టు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కురువ తిమ్మప్ప (45), రాయచోటి ప్రాంతానికి చెందిన కుమ్మరి సుమలత (26) సంఘటన స్థలంలో అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే 108 ద్వారా పెద్దదోర్నాల వైద్యశాలకు తరలించారు. రాయచోటి ప్రాంతానికి చెందిన కుమ్మరి నరసింహులు (30) పెద్దదోర్నాల వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన నరసింహులు సుమలత భార్యాభర్తలు కాగా కుమార్తె లిఖిత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయతే, వీరి కుమారుడు నితిన్‌కు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడడం విశేషం. కర్నూలు శంకర్‌బండ గ్రామానికి చెందిన కే. కాశిరామిరెడ్డి భార్య పద్మావతి, కుమారుడు పండుకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో లిఖిత, కాశిరామిరెడ్డి, పద్మావతి, పండుతోపాటు, గాయపడిన తెలంగాణకు అలంపూర్‌కు చెందిన ఐజయను కూడా కర్నూలుకు తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన కురియప్ప కాలు విరిగింది. ఆయన భార్య భాగ్యలక్ష్మి కాలికి, కుమారుడు రఘు తలకు గాయాలయ్యాయ. రామసుబ్బయ్య, కురువ స్వామి, కల్వకుర్తికు చెందిన సుశీల, రవి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎనిమిది మందిని నరసరావుపేటకు తరలించారు. కాగా, నల్లమల అటవీ ప్రాంతం బాధితుల ఆర్తనాదాలలతో మార్మోగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే యర్రగొండపాలెం సిఐ మురళీకృష్ణ, దోర్నాల ఎస్సై సుబ్బారావు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు, నరసరావుపేట వైద్యశాలలకు ప్రైవేటు వాహనాల్లో తరిలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోగులకు వైద్యులు ప్రకాశ్, దస్తగిరి తదితరులు వైద్య సేవలలు అందించారు.