క్రైమ్/లీగల్

అయోధ్య ‘మధ్యస్థం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని మధ్యవర్తిత్వం, సంప్రదింపుల ద్వారా పరిష్కరించే అంశంపై త్వరలో ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. శాంతియుతంగా ఈ అంశాన్ని పరిష్కరించేందుకు వీలుగా అర్హులైన మధ్యవర్తుల పేర్లను కేసులోని పార్టీలు తమకు తెలియచేయాలని కోర్టు సూచించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ధర్మాసనంలో జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్ ఉన్నారు. హిందూ సంస్థల్లో పార్టీలైన నిర్మోహీ అఖారా తప్ప మిగిలిన సంస్థలు మధ్యవర్తిత్వం విధానాన్ని వ్యతిరేకించాయి. కాగా ముస్లిం సంస్థలు ఈ ప్రతిపాదనను స్వాగతించాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, పరిష్కారానికి సుముఖత ఉన్న పక్షంలోనే మధ్యవర్తిత్వం అవసరమన్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా మధ్యవర్తిత్వం సరైన పరిష్కారం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ రామలల్లా సంస్థ తరఫున వాదనలు వినిపిస్తూ, మధ్యవర్తిత్వం ఎటువంటి పరిష్కారాలు చూపలేదని చెప్పారు. అయోధ్యలో రాముడు జన్మించారనే దానికి రుజువు అక్కర్లేదని, కాని రామజన్మస్థలంపైనే వివాదమన్నారు. జన్మభూమి సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించలేరని అన్నారు. ముస్లిం సంస్థలు మాత్రమే కోర్టు హాలులోనే అంతరంగికంగా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ ప్రొసీడింగ్స్‌లో ఇతరులను అనుమతించరాదన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వాదనలు వినిపిస్తూ వివాదంగా మారిన భూమి కేంద్రానిదని అన్నారు. వివాదస్పద భూమిలో దేవాలయం ఆనవాళ్లు ఉంటే, తప్పనిసరిగా రామాలయం నిర్మాణానికి కేటాయిస్తామని 1994లో పీవీ నరసింహారావు ప్రభుత్వం పార్లమెంటులో పేర్కొన్నదని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ.. ఈ వివాద స్థలం కేవలం ఆస్తిమాత్రమే కాదు.. సున్నితమైన అంశం.. నమ్మకాలు, సెంటిమెంట్ ఇమిడి ఉన్నాయ.. మొఘల్ రాజు బాబర్ ఏమి చేశాడు.. ఆ తర్వాత ఏమైందనే విషయం ఇప్పుడు అప్రస్తుతం అని కోర్టు స్పష్టం చేసింది.