క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో అవినీతి చేపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, మార్చి 6: కడ్తాల మండల ప్రభుత్వ పశువైద్యాధికారి రవిచంద్ర తన కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న పర్వీన్ ద్వారా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాధిత రైతు హన్మంత్ రెడ్డి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం... కడ్తాల మండలం రావిచెడ్ గ్రామానికి చెందిన రైతు హన్మంత్ రెడ్డి ఇటీవల 12 పశువులను కొనుగోలు చేశాడు. పశువులకు ఇన్స్‌రెన్స్ చేయించేందుకోసం మండల పశువైద్యాధికారి నుంచి పశువుల వయస్సు ఆరోగ్య ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారని వారు పేర్కొన్నారు. ఒకోక్క పశువుకు రూ. 600 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. దింతో రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులను బాధిత రైతు ఆశ్రయించడంతో బుధవారం కడ్తాల పశువైద్యశాలలో అటెండర్ పర్వీన్ ద్వారా 7200 రూపా యలను పశువైద్యాధికారి రవిచంద్ర తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐ రామలింగా రెడ్డి, గంగాధర్, మజీద్ అలీ, నాగేంద్ర బాబు పాల్గొన్నారు.