క్రైమ్/లీగల్

రాఫెల్ కీలక డాక్యుమెంట్ల అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒప్పందానికి సంబంధించిన కీలకపత్రాలు అపహరణకు గురయ్యాయని, కాగా ఒక ఆంగ్లదినపత్రిక వీటిల్లోని సమాచారాన్ని అధికార రహస్య చట్టం ఉల్లంఘించి ప్రచురించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించి పత్రాల్లోని వివరాలను బహిర్గతం చేసిన పత్రికపైన కోర్టు ధిక్కారం కింద కేసునమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని కేంద్రం కోర్టును కోరింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్రం తరఫున వాదనలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వినిపించారు. విలువైన పత్రాలు అపహరణకు గురైన ఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు. గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన రాఫెల్ డీల్‌పై కోర్టు ఇచ్చిన తీర్పును పునసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టులో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ తస్కరణకు గురైన డాక్యుమెంట్లలోని వివరాలను ఒక ఆంగ్లపత్రికప్రచురించిందని చెప్పారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేద్నారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని తస్కరణకు గురైన డాక్యుమెంట్లలో ఏముందని, ఎలా పత్రికకు చేరాయని ప్రశ్నించింది. ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.