క్రైమ్/లీగల్

అప్పులు, అనారోగ్యంతో దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మార్చి 23: కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యంత దయనీయ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణ వీధి పాత పోస్ట్ఫాసు సెంటరు కొండ ప్రాంతంలో నివాసముంటున్న గూడూరు కృష్ణ (55), వెంకట సత్యవతి (50) శుక్రవారం ఉదయం ఒకే సీలింగు ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. తొలుత భర్త లుంగీతో ఉరేసుకోగా భార్య గమనించింది. వేలాడుతున్న కృష్ణను లుంగీని కత్తిరించి కాపాడటానికి ప్రయత్నించింది. అప్పటికే అతను మృతి చెందాడని తెలుసుకుంది. దాంతో అదే సీలింగు ఫ్యానుకు చీరతో ఉరేసుకుని తానూ తనవు చాలించింది. సమాచారం అందిన కొత్తపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెస్ట్‌జోన్ ఏసీపీ జీ రామకృష్ణ అక్కడకు చేరుకుని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మృతుడు సామారంగం చౌక్‌లో కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాడు. మృతురాలు బ్రాహ్మణ వీధిలోనే మాజేటి కల్యాణ మండపం సమీపంలో 20 రోజుల క్రితం వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె వెంకట పద్మావతి, చిన్న కుమార్తె ఉమారాణిల వివాహాలు అయ్యాయి. వారి కుమారుడు సాయికుమార్ బెంగుళూరులో సీఏ ప్రాక్టికల్స్ ట్రైనింగ్ పొందుతున్నాడు. దంపతులిద్దరూ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వారికి రూ.20 లక్షలు అప్పులున్నట్లు తేలింది. అనారోగ్యం, అప్పుల కారణంగా వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరికి స్థిరాస్థులు ఎక్కువగానే ఉన్నాయని, ఇల్లు అమ్మి అప్పులు తీర్చాలనే విషయంపై వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడు సాయికుమార్ బెంగుళూరు నుండి శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నాడు.