క్రైమ్/లీగల్

ఈ దశలో ఆదేశించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ, ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈదశలో తాము ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను ఈనెల 28కు వాయిదా వేసింది. ఈబీసీలకు 10 శాతం కోటాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు. కేంద్రం ప్రభుత్వం నిర్ణయంపై స్టే ఇవ్వడానికి ఇంతకు ముందే సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా కేంద్ర నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? అన్న అంశంపై విచారించేందుకు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్‌ఖన్నాతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. వ్యాపారవేత్త, కాంగ్రెస్ సానుభూతి పరుడు తెహ్‌సీన్ పూనావాలా వేసిన పిటిషన్‌పై బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధనలు ఉల్లంఘించి ఈబీసీలకు 10 శాతం కోటా కల్పించారని ఇది చట్టవిరుద్ధమని పిటిషనర్ ఆరోపించారు. పది శాతం కోటాను సవాల్ చేస్తూ గతంలోనే దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా పూనావాల పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు జతచేసి విచారించాలని నిర్ణయించింది. జనహిత అభియాన్, యూత్‌ఫర్ ఈక్వాలిటీ అనే ఎన్‌జీవో కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేశాయి. యూత్ ఫర్ ఈక్వాలిటీ అధ్యక్షుడు కౌశల్ కాంత్ మిశ్రా పిటిషన్ వేశారు. 103 రాజ్యాంగ సవరణ కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. ఈబీసీ కోటా రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. అలాగే రిజర్వేషన్లు 50 శాతానికి మించికూడదన్న నిబంధనను కేంద్రం ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. 1992లో ఇందిరా సహానీ కేసులో తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చెల్లుబాటు కాదని, రాజ్యాంగ ఉల్లంఘనేనని పిటిషనర్ వాదిస్తున్నారు.