క్రైమ్/లీగల్

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 11: గంజాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎక్సైజ్ సీఐ వెంకటేశం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం, పొత్నూర్ గ్రామానికి చెందిన బొమ్మకంటి ఆనంద్ గౌడ్ (23) సుచిత్ర చౌరస్తా నుంచి కుత్బుల్లాపూర్ గ్రామానికి కాలేజీ బ్యాగులో గంజాయితో వెళ్తున్నాడు. అనుమానంతో ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా ఎండు గంజాయిని తీసుకువెళ్తున్నట్లు తేలింది. ఆనంద్ గౌడ్‌ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1.250 కిలోల ఎండు గంజాయిని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.