క్రైమ్/లీగల్

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 11: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం నవాబుపేట్ మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన పెద్దగొల్ల నర్సిములు (45) వికారాబాద్ నుంచి అక్నాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. మండల పరిధిలోని పులుసుమామిడి గేట్ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే నర్సిములు మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.