క్రైమ్/లీగల్

రూ. 91లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 11: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసు శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన మీదట అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌లో భాగంగా నగర పోలీసు శాఖ ఎన్నికల సంఘం నియమావళిని అమలు చేస్తోంది. నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. దీనిలోభాగంగా సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలో తొలి చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే చర్యల్లో భాగంగా ఎరులై పారే డబ్బు, మద్యం, ఇతర ఆకర్షక పంపిణీలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈక్రమంలో సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలోని భానునగర్ జంక్షన్ వద్ద పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ డీసీపీ-2 సీహెచ్ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షణలో నార్త్ ఏసీపీ కే రమేష్‌బాబు ఆధ్వర్యాన సత్యనారాయణపురం సీఐ కనకారావు సిబ్బందితో సోమవారం భానునగర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏపీ16ఎఫ్‌డీ 6789 నెంబరు ఇన్నోవా కారులో ఎలాంటి బిల్లులు లేకుండా అనధికారికంగా తరలిస్తున్న రూ. 91లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారులో నగదు తరలిస్తున్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన ఆలూరి జగన్మోహన్‌రావు (50), విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన యండ్లూరి కిరణ్‌కుమార్ (27)ను అదుపులోకి తీసుకున్నారు. నగదు సహా వీరిని విచారణ నిమిత్తం పోలీసులు ఆదాయపన్ను శాఖాధికారులకు అప్పగించారు. ఇదిలావుండగా ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు హెచ్చరించారు. మద్యం, దుస్తులు, వస్తువులు, డబ్బుల పంపిణీ అదేవిధంగా విందు భోజనాలు ఏర్పాటు చేయడం, అనుమతి లేని వాహనాలు ఎన్నికల ప్రచారానికి వినియోగించడం, అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదీ లేదని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా నిరంతరం తనిఖీలతోపాటు నిఘా ఉంటుందన్నారు. ఈ తరహా కార్యకలాపాలకు సంబంధించి ప్రజలు కంట్రోల్ రూంకు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.