క్రైమ్/లీగల్

నిబంధనలు ఉల్లంఘించి ఇద్దరు డ్రైవర్ల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, మార్చి 2: నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలను నడిపి రోడ్డు మీద ఇద్దరు డ్రైవర్లు దెబ్బలాటకు దిగి బ్రేక్ ఇన్‌స్పెక్టర్ దృష్టిలో పడిన సంఘటన సోమవారం జరిగింది. పోరంకి సూర్యదేవాలయం వద్ద చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులను ఇంటికి తరలించే ప్రయత్నంలో బస్ డ్రైవర్ రాంగ్ రూట్‌లో నడిపాడు. ఎదురుగా వస్తున్న ఎన్‌ఆర్ బ్రిలియంట్ జూనియర్ కాలేజ్‌కి చెందిన వ్యాన్ డ్రైవర్ జీ సాయి కోపంతో చైతన్య బస్ డ్రైవర్ రామ్ ప్రసాద్‌ను కొట్టడంతో దగ్గరలోని అసిస్టెంట్ మోటార్ వాహనాల ఇన్‌స్టెర్ సోనీప్రియ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. చైతన్య పాఠశాల డ్రైవర్ రాంగ్ రూట్‌లో నడిపినందుకు, సాయి నడిపిన వ్యానుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవటంతో ఇద్దరి మీద కేసు నమోదు చేయటంతోపాటు పాటు బస్‌ను, వ్యాను స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మూడు టిప్పర్లు, బైక్‌లు, టాక్సీల వాహనదారులపై సుమారు రూ.లక్ష అపరాధ రుసుము విధించినట్లు సోని ప్రియ తెలిపారు.