క్రైమ్/లీగల్

హవాలా ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని వివిధ పట్టణాలకు నగదును పంపుతూ కమీషన్ పద్ధతిలో వ్యాపారం చేస్తున్న నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి సుమారు రూ. 90.50 లక్షలతో పాటు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొదటి సారిగా హైదరాబాద్‌లో భారీ ఎత్తున నగదును పట్టకున్నామన్నారు. నిందితులు అక్రమంగా నగదును బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సుల్తాన్‌బజార్, కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ప్రాంతల నుంచి నగదును బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్న దేవాస్ కొతూరి, భక్తి ప్రజాపతి, కాన్‌బిర్లా నసీమ్, విశాల్ జైయిన్‌లను టాస్క్ఫో ర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేవన్నారు. ఇలా ఉండగా ఎన్నికల కోడ్ వచ్చినందున బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేకుండా చేపట్టకూడదన్నారు. ఎలాంటి ధృవపత్రాలు లేకుం డా నగదు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటామన్నారు. మీడియా సమావేశంలో అదనపు డిప్యూటీ కమిషనర్ చైతన్యకుమార్, టాస్క్ఫోర్స్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్ స్వామి, వెంకటేష్ పాల్గొన్నారు.

చిత్రం.. నిందితులను అరెస్టు చేసి, నగదు పరిశీలిస్తున్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్