క్రైమ్/లీగల్

గొలుసు కట్టు వ్యాపారం.. రూ. వెయ్యి కోట్ల మోసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: తక్కవ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశచూపి జనాన్ని మోసం చేసిన ఈ-బిజ్ సంస్థ నిర్వాహకుడు పవన్ మలాన్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా గొలుసుకట్టు వ్యాపారం చేస్తూ దాదాపు రూ. 1000 కోట్ల వరకు వసూలు చేశారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ- బిజ్ సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా లో 2001లో ప్రారంభించారన్నారు. సంస్థ నిర్వాహకుడు పవన్ మలాన్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశామన్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాలో రూ. 70 లక్షలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ-బిజ్ సంస్థలో దాదా పు 7 లక్షల మంది సభ్యులు ఉన్నారని వెల్లడించారు.
సంస్థలో చేరిన సభ్యులు కొత్తవారిని చేర్పిస్తే కమీషన్ ఎక్కువ ఇస్తామని న మ్మబలకుతారు. దీంతో సామాన్యులు భారీ గా చేరతారు. సంస్థలో ఒకవ్యక్తి రూ. 16 వేలు జమచేస్తే రూ. 10 వేల పాయింట్లు ఇస్తామని మోసం చేసినట్లు గుర్తించామని సజ్జనార్ తెలిపారు. కమీషన్ ఎక్కువ రావాలంటే సదరు వ్యక్తి మరో ఇద్దర్ని సంస్థలో చేర్పించాలన్న నిబంధన పెట్టారు. ఇతర భాషల్లో కూడా సభ్యులను చేర్పించాలని ఎవరైనా ముందుకు వస్తే వారికి ఈ లెర్నింగ్ కోర్స్‌లు నేర్పిస్తామని హామీ ఇస్తారు. అయితే ఈ లెర్నింగ్ కోర్సులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా 58 కోర్సులను నడిపేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే హాలిడే ప్యాకేజీ ఇస్తామని సభ్యులను మోసగించినట్టు వెల్లడించారు. తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్ జి ల్లాల్లో ఈ మోసా లు బయటపడ్డాయన్నారు. బాధితులు సైబారాబాద్ పోలీసులను ఆశ్రయించారని చెప్పా రు. గతంలో క్యానెట్ కేసులో బాధితులు దాదాపు 65 మంది పోలీసులకు ఫిర్యాదులు చేశారన్నా రు. కాగా గొలుసుకట్టు మోసాలకు పాల్పడిన సంస్థ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ- బిజ్ సంస్థలో ఎక్కువ మంది తక్కువ జీతాలు వచ్చే వ్యక్తుల కుటుంబాలు ఉన్నాయని కమిషనర్ సజ్జనార్ చెప్పారు.

చిత్రం.. మీడియా ఎదుట వివరాలు వెల్లడిస్తున్న సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్