క్రైమ్/లీగల్

కూలిన వంతెన: ఐదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ సమీపంలో మరమ్మతులో ఉన్న ఓ పాదచారుల వంతెన కూలిపోయిన ఘటనలో ఐదుగురు మరణించారు. 28 మంది గాయపడ్డారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో అత్యంత రద్దీగా ఉండే ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో జనం ఎక్కడంతో వారి బరువుకు ఈ వంతెన కూలిపోయిందని చెబుతున్నారు. మరణించినవారిలో ఇద్దరు మహిళలను సమీపంలోని జీటీ ఆసుపత్రి సిబ్బందిగా గుర్తించారు. ఆ ఆసుపత్రిలోనే కొందరు క్షతగాత్రులకు చికిత్స చేస్తున్నారు. ఒకపక్క మరమ్మతులు జరుగుతున్నా ఈ వంతెనపై పాదచారులను అనుమతించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సాక్షులు తెలిపారు. 1984లో నిర్మించిన ఈ వంతెన మార్గంలో రోజువారీగా లక్షలాదిమంది రాకపోకలు జరుగుతుంటాయి. వంతెన శిథిలాల కింద మరో 12 మంది చిక్కుకుపోయి ఉండవచ్చునన్న కథనాలు వెలువడుతున్నాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

చిత్రం.. సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు