క్రైమ్/లీగల్

ఎంఈఎస్ ఇంజనీర్లపై సీబీఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 16: నేవల్ డాక్‌యార్డు మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) ఆధ్వర్యంలో సివిల్ వర్క్‌కు సంబంధించి టెండర్ ఆమోదానికి కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఏసీబీ విభాగం ముగ్గురిపై కేసు నమోదు చేసింది. సివిల్ వర్క్‌కు సంబంధించి రూ.3.5 లక్షలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించాడు. దీనికి సంబందించి సీబీఐ పోలీసుల వివరణ మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానిక రైల్వే న్యూకాలనీకి చెందిన యూనివర్శల్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ డాక్‌యార్డులో సివిల్ వర్క్‌కు టెండర్ దాఖలు చేసింది. టెండర్ ఆమోదించాలంటే గారిసన్ ఇంజనీర్‌కు రూ.2.5 లక్షలు, ఏఈ, జేఈ, ఇతర కార్యాలయ సిబ్బందికి రూ.లక్ష లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఇచ్చుకోలేక కాంట్రాక్టర్ సీబీఐ అవినీతి నిరోధక విభాగాన్ని ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు జీఈ ప్రశాంత్ సివేర్, ఏఈ కేఎస్‌ఆర్ సోమేశ్వర రావు, జేఈ రామారావుపై కేసు నమోదు చేశారు.