క్రైమ్/లీగల్

టెంట్ హౌజ్ గోదాంలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మార్చి 17: టెంట్ హౌజ్ గోదాంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల విలువ గల ఆస్తినష్టం సంభవించిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సాగర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న రాముకు కాలనీలో టెంట్ హౌజ్‌కు సంబంధించిన గోదాం ఉంది. ఆదివారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గోదాంలో టెంట్‌హౌజ్‌కు సంబంధించిన సుమారు రూ.30 లక్షల విలువగల టెంట్ సామాను దగ్ధం అయినట్లు పోలీసులు అంచనా వేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అగ్ని మాపక యంత్రాలను తెప్పించి మంటలను అదుపు చేయించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.